
పోలీస్ స్టేషన్ భవనం ఎస్పీ సందర్శన
తెలుగు వార్తపత్రిక న్యూస్ ఆగిరిపల్లి :
ఆగిరిపల్లి గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏలూరు జిల్లా ఎన్నీ రాహుల్ దేశ్ శర్మ శుక్రవారం సాయంత్రం నందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులను పరిశీలించారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభిస్తామని చెప్పారు. ట్రాఫిక్ నమన్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీఐ ఆర్. అంకబాబు, ఎన్ఐ ఎన్.చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.