మచిలీపట్నం పార్లమెంట్ తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు గా ఆదినారాయణ
తెలుగు వార్త :న్యూస్

మచిలీపట్నం పార్లమెంట్ తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు గా ఆదినారాయణ
తెలుగు వార్త ,మచిలీపట్నం, ఏప్రిల్ 01:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను నియమించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అధికారికంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సి సెల్ అధ్యక్షులు గా మాచవరపు ఆదినారాయణ ను నియమించారు.ఈ సందర్భంగా పార్లమెంటు అధ్యక్షులు గా నియమించబడ్డ ఆదినారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నపై ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ పదవి ద్వారా తెలుగుదేశం పార్టీ కి పూర్వవైభవం తీసుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆదినారాయణ అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షులు గా నా నియామకానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీ ప్రముఖ నాయకులు అందరికీ, తెదేపా కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఆదినారాయణ నియామకం పట్ల ఎస్సీ సంఘాలు,ప్రజా సంఘాల ప్రముఖ నాయకులు,పలువురు హర్షం వ్యక్తం చేశారు.