విద్యార్థి దశలోనే సామాజిక
వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్

విద్యార్థి దశలోనే సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్
తెలుగు వార్త :
ఆత్మకూరు: జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘసంస్కర్త అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు, సిఐటియు జిల్లా నాయకులు రణధీర్ లు అన్నారు. మంగళవారం పట్టణంలోని ధనుంజయ మీటింగ్ హాల్ నందు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్ అధ్యక్షతన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించారన్నారు. 1935 సంవత్సరంలో సమానత్వం కోసం అంకితమైన ఆలిండియా డి ఫైస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడం లో అతను కీలక పాత్ర పోషించారన్నారు. 1937లో బీహారు శాసనసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమం నిర్మించారని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఐటీయు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, నాయకులు వలి, రైతు సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా, నాయకులు వీరన్న, పాల శివుడు, కెవిపిఎస్ నాయకులు బజార్, సుబ్బయ్య, దాసు, జి.స్వాములు, రవి రమణ తదితరులు పాల్గొన్నారు.