ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమింపబడిన మెడబలిమి వెంకటేశ్వరరావు
తెలుగు వార్త :న్యూస్

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమింపబడిన మెడబలిమి వెంకటేశ్వరరావు
తెలుగు వార్త :
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం: కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వై.పాలెం అభ్యర్థిగా పోటీ చేసిన మెడబలిమివెంకటేశ్వరరావు ను ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ సాకె శైలజనాథ్ శుక్రవారం నాడు బాపట్లలో జరిగిన ఒక కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో శక్తియుక్తులన్నీ వడ్డీ పని చేయాలని ఆయన ఆదేసించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిబాబు ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి నాగలక్ష్మి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వెంకటేశ్వరరావు రాధా కృష్ణ అలాగే అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాల కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నుంచి డిపార్ట్మెంట్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జునరావు ను మరియు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా ఎన్నికైన మెడబలిమి వెంకటేశ్వరరావు ను కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పూలదండ వేసి ఘనంగా సన్మానించారు.