ఆత్మకూరు అగ్రికల్చర్ ఆఫీసర్ జిఎం. అల్తాఫ్ ఖాన్ కు మర్యాదపూర్వకంగా కలిసిన రైతు భరోసా కేంద్రం చైర్మన్ హాజీ బైరాపురం మహబూబ్ బాషా
తెలుగు వార్త :న్యూస్

ఆత్మకూరు అగ్రికల్చర్ ఆఫీసర్ జిఎం. అల్తాఫ్ ఖాన్ కు మర్యాదపూర్వకంగా కలిసిన పూల బొకేలు అందించిన రైతు భరోసా కేంద్రం చైర్మన్ హాజీ బైరాపురం మహబూబ్ బాషా, ఏవో విష్ణువర్ధన్ రెడ్డి.
=================================
తెలుగు వార్త న్యూస్ : ఆత్మకూరు టౌన్.
ఆత్మకూరు అగ్రికల్చర్ ఆఫీసర్ జిఎం అల్తాఫ్ ఖాన్ (ఏడిఏ) గురువారం నాడు బాధ్యతలను స్వీకరించారు. ఈయన కర్నూల్ నుంచి బదిలీ అయి ఆత్మకూరు పట్టణానికి రావటం జరిగింది. ఆత్మకూర్ అర్బన్ రైతు భరోసా కేంద్రం చైర్మన్ హాజీ బైరాపురం షేక్ మహబూబ్ బాషా, ఏవో విష్ణువర్ధన్ రెడ్డి, ఏ ఈ ఓ మహేష్, ఎంపీఈవో రవి గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ అర్బన్ రైతు భరోసా కేంద్రం చైర్మన్ హాజీ బైరాపురం మహబూబ్ బాషా మాట్లాడుతూ… అగ్రికల్చర్ ఆఫీసర్ గా…మా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందిస్తున్న పథకాలు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయని కొనియాడారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి రైతుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీ కింద విత్తనాలను ఎరువులను సబ్సిడీ కింద వ్యవసాయ పనిముట్లు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా అధికార యంత్రాంగం పనిచేయటానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతులు సముద్రాల శిఖామణి, ముసలిమడుగు నబి సాహెబ్, దుబ్బ లింగమూర్తి, నిజాముద్దీన్, అబ్దుల్ రసూల్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.