
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు
శిరిగిరి రామిరెడ్డి(అడ్వకేట్) ఆళ్లగడ్డ
తెలుగు వార్త :
శిరివెళ్ళ:(యర్రగుంట్ల); న్యాయవాదుల సంక్షేమ నిధికి రు.100 కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి న్యాయవాది శిరుగిరి రామిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి నిధికి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం పై ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు.
మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. మొదటి విడతగా రు. 25 కోట్లు విడుదల చేసిందని తర్వాత 75 కోర్టు బార్ అసోసియేషన్ కు జమ చేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో మృతి చెందిన న్యాయవాది కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు.
ఈ మొత్తాన్ని ఎనిమిది లక్షలు పెంచేందుకు హామీ ఇచ్చారన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వడం హర్షణీయమన్నారు. న్యాయవాదుల సంక్షేమ కోసం గతంలో ఈ ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్ బాగా కృషి చేస్తున్నారు.
అందువల్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.