
ఆత్మకూరులో.. కాటం సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు శిల్ప కార్తీక్ రెడ్డి.
కాటం సూపర్ మార్కెట్ పుష్ప రాజ్… నాణ్యతల తగ్గేదేల్యా…
కాటం సూపర్ మార్కెట్ ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోండి: వైసిపి యువకిశోరం శిల్ప కార్తీక్ రెడ్డి.
=================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కప్పల కుంట లో కాటం సూపర్ మార్కెట్ ను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే తనయుడు శిల్ప కార్తీక్ రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాటం సూపర్ మార్కెట్ ను ఆత్మకూరు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిత్యావసర సరుకులు సరసమైనటువంటి ధరకు అందించాలని కాటం సూపర్ మార్కెట్ నిర్వాహకులకు సూచించారు. ఆత్మకూరు పట్టణం ప్రజలందరూ,గ్రామాల నుండి పట్టణానికి నిత్యావసర సరుకులకు వచ్చేటువంటి వారు కాటం సూపర్ మార్కెట్ ను సందర్శించి కుటుంబానికి కావలసిన అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న అటువంటి ఆత్మకూరు పట్టణంలో సూపర్ మార్కెట్ ప్రారంభించడం చాలా గొప్ప విషయమన్నారు. నాణ్యతా పరంగా రాజీపడకుండా సరుకులు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు కి తెలియజేశారు. ఈ కాటం సూపర్ మార్కెట్ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందాలని కోరారు. ప్రజలకు అన్ని వస్తువులు సరసమైన ధరల్లో లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కాటం సూపర్ మార్కెట్ నిర్వహకులని కోరారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ నిర్వాహకులు సరసమైన ధరలో నాణ్యమైన ఎటువంటి వస్తువులు అందిస్తున్నామని, రెండు మూడు రోజులు డిస్కౌంట్ తో వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు వైసీపీ పట్టణ అధ్యక్షులు అంజాద్ ఆలీ, ఎంపీపీ ఎన్. తిరుపాలమ్మ, నాగన్న, వైసీపీ నాయకులు పువ్వాడి భాస్కర్, సింగిల్విండో చైర్మన్ సురేష్, మాజీ కౌన్సిలర్ తిమోతి, కౌన్సిలర్ సుల్తాన్, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.