బాపనంతపురం గ్రామంలో అట్టహాసంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
తెలుగు వార్త

బాపనంతపురం గ్రామంలో అట్టహాసంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
====================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరల్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని బాపనంతపురం గ్రామంలో ఆదివారం నాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా వై. జయరాజు కర్నూలు సీనియర్ న్యాయవాది, ఏపీ హైకోర్టు అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ లాయర్స్ పోరం ఆర్డిఓ ఎం. దాస్, మండల ఎంపిపి ఎన్. తిరుపాలమ్మ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రాబిన్సన్, డాక్టర్ రాయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువకులు ముందుండి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమము నందు మండల ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు బుజ్జి, న్యాయవాదులు రవికుమార్, దళిత నాయకులు వెంకటేశ్వర్లు, శుభాకర్, గ్రామ సర్పంచ్ ధరగయ్య,యుగంధర్
ప్రేమ్ కుమార్,శీలం శేషు, కల్లూరి మస్తానయ్య, నాగన్న తదితరులు పాల్గొన్నారు.