ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రావు
తెలుగు వార్త :

ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రావు.
================================
తెలుగు వార్తన్యూస్: ఆత్మకూరు టౌన్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వివిధ వార్డులలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదివారం నాడు పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని ప్రజలకు సూచించారు. తడి పొడి చెత్త వేరువేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందించి సహకరించాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా డ్రైనేజీ వ్యవస్థను పలు ప్రాంతాల్లో ఉన్న కన్వర్ట్ ను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేటట్లు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా పనులను చేయించారు. పలు వార్డులలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ బ్లీచింగ్ పౌడర్ ను చలించారు.