నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం
తెలుగు వార్త :

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం
మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామస్తులైన వంగల వెంకట సుబ్బమ్మ గారి మనవరాలు వంగల శివశంకర్ రెడ్డి, లక్ష్మి మౌనిక దంపతుల చిన్న కుమార్తె లక్ష్మి శ్రీతాజా పుట్టినరోజు సందర్భంగా”
తెలుగు వార్త :
“నంద్యాలలోని వైయస్ఆర్ నగర్ లో నివాసం ఉన్న నిరు పేద కుటుంబానికి చెందిన దేవమ్మ అనే వృద్ధురాలి కి తన కొడుకు, కోడలు అనారోగ్యంతో చనిపోవడంతో తన మనవరాళ్లు అయిన నలుగురు పిల్లలను కష్టపడి చదివిస్తూ, కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని గమనించి ఈ కుటుంబానికి లక్ష్మి శ్రీతాజా పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు, పిల్లలకు నోట్ బుక్స్ ఇవ్వడం జరిగినది.”
సహకరించిన దాతలకు మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యుడు హుస్సేన్ వలి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ పిల్లల చదువుకు కావలసిన నోట్ బుక్స్ కు దాతలు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యుడు హుస్సేన్ వలి పాల్గొన్నారు.