
సిద్ధవటం, జూలై.15,తెలుగు వార్త. న్యూస్
సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టండి.
వైఎస్ఆర్సిపి నాయకుల పల్లె రామకృష్ణారెడ్డి
సిద్ధవటం మండలంలోని జంగాలపల్లి గ్రామపంచాయతీలో మూడు గ్రామాలకు వెళ్లే రహదారి ఇసుక క్వారీ నుండి రాకపోకలు జరిపే ఇసుక టిప్పర్లు,ట్రాక్టర్ల వలన మరమ్మతులకు గురై మట్టి పేరుకుపోయి ప్రమాదకరంగా మారిందని,మరమ్మత్తులకు గురైన ఈ రహదారికి కొద్దిపాటిదూరంలో వంక వద్ద బ్రిడ్జి ఉన్నదని అది పడిపోయినందున మరమ్మత్తులకు రింగ్ పైపులను తెప్పించి బ్రిడ్జి మొత్తం ఏర్పాటు చేయకుండా సగం కట్టి అలాగే వదిలేసారని వర్షాలు పడినప్పుడు పొలాలు మునిగి పోవడం మరియు కట్ట త్రేగి పొలాల్లోకి నీరు చేరి భూములు కోతకు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయని ఇంతమంది అధికారులు వస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవడంలేదని,అలాగే జంగాలపల్లి గ్రామ సమీపంలో ఇంకో పెద్ద వంక వద్ద ఇసుక కుప్పలు దిబ్బలుగా పడి ఉన్నాయని అక్కడి సమీపంలోనే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యి కాళ్లు పోగొట్టుకున్నారని రాత్రి వేళలో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి జారీ పడుతున్నారని మరియు గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో సిసి రోడ్డు ఇసుక వాహన రాకపోకలతో మట్టి రోడ్డు లాగా తయారయిందని అసలు ఇది సిసి రోడ్డెనా అని పల్లె రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.పరిసరంలో ఓ పొలానికి చుట్టూ ఉన్న రక్షణ కవచ కంచెను కూడా ఇసుక వాహనాలు రెండు సార్లు ఈడ్చికెళ్లాయని గ్రామస్తులు వారిని పట్టుకుని నిలదీయడంతో నూతన కంచెను ఏర్పాటు చేసారని ఈ వాహనాల రాకపోకలు జరుగకుండా వేరే చోటు నుండి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా రహదారిని ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పై సమస్యలను అధికారులు పరిష్కరించాలని పల్లె రామకృష్ణారెడ్డి తెలిపారు.గ్రామానికి చెందిన ఓ మహిళ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఇంటి సమీపంలో ఎరువు ఉంటే వాహనాలు తిరుగుతుండడంతో పాడైందని రోడ్ల గుండా తిరగలేక పోతున్నామని తమ గ్రామానికి సంబంధిత అధికారులు పరిష్కారం చూపాలని అన్నారు.