ANDHRASPORTS

ఉమ్మడి జిల్లాల త్రో బాల్ ఓపెన్ టోర్నమెంట్

తెలుగు వార్త :

ఉమ్మడి జిల్లాల త్రో బాల్ ఓపెన్ టోర్నమెంట్

గురు రాఘవేంద్ర విద్యాసంస్థ చైర్మన్ దస్తగిరి రెడ్డి మౌలాలి రెడ్డి స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి..

6 నుంచి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనవలెను…..

నంద్యాల జిల్లా తెలుగు వార్తలు స్పోర్ట్స్ న్యూస్ :-స్థానిక నంద్యాల పట్టణంలోని గురు రాజా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రతి ఏటా జరిపే పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెమోరియల్ కప్పు క్రీడా పోటీలకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వచ్చేనెల అక్టోబర్ లో జరిగే 22 23 24 తేదీలలో జరిగే ఆరవ జిల్లాస్థాయి త్రోబాల్ పోటీల బాలుర మరియు బాలికల పాంప్లెట్స్ ను శ్రీ గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ శ్రీ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి గారు లాంచనంగా ప్రారంభించారు అదేవిధంగా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఎయిడెడ్ మున్సిపల్ మరియు ప్రైవేటు యాజమాన్యాల అన్ని స్కూళ్లకు సంబంధించిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయాలని కోరారు అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు తమ పిల్లలను మంచిగా ప్రాక్టీస్ చేపించి ఈ టోర్నమెంట్ లో పాల్గొనే విధంగా చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి గారు మరియు గురు రాజా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ పి షేక్షావల్లి రెడ్డిగారు పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందని సభా ముఖంగా తెలిపారు అదేవిధంగా గెలుపొందిన విన్నర్స్ రన్నర్స్ కు షీల్డ్ తో పాటు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పోటీలలో మంచి నైపుణ్యం నైపుణ్యంతో కూడిన క్రీడాకారులకు బెస్ట్ ప్లేయర్ అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్కూల్ గేమ్ కార్యదర్శి పివి రమణారెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మరియు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు శంకర్ ZSP దివాకర్ కమలాపూర్ హెచ్ ఎమ్ మోహన్ రెడ్డి గారు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శివలింగం గోపి నాయక్ భుజంగరావు భరత్ రెడ్డి రాజేష్ బాల వెంకట్ బాలకృష్ణ ప్రైవేట్ వ్యామో ఉపాధ్యాయులు చిరంజీవి రెడ్డి సుదర్శన్ రామసుబ్బారెడ్డి రామేశ్వర్ రెడ్డి మాలిక్ కిరణ్ తిరుపతిరెడ్డి వెంకటేశ్వర్లు రాజేష్ గురురాజా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బారావు రాజశేఖర్ పెద్దిరాజు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!