
ఇప్పుడేమి సమాధానం చెబుతావ్ విజయసాయిరెడ్డి…?
టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు. తెలుగువార్తన్యూస్:జంగారెడ్డిగూడెం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మన రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు అనేక ఆర్థిక, అవినీతి ఆరోపణల కేసుల్లో A2 విజయ్ సాయి రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి పేరుని ఈడి చేర్చడం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు శ్రీనివాసపురం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. నీ దొంగ లెక్కల తో మరోసారి దొరికేశావు విజయసాయిరెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతావు.. నీతోపాటు జగతి పబ్లికేషన్స్ యజమాని ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డికి కూడా లింక్ ఉందనే అనుమానం కలుగుతోంది అని.. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం లో మన రాష్ట్రానికి లింకులు ఉన్నాయని వార్తలు వస్తున్నా నేపథ్యంలో నిన్న హైదరాబాదులో ఈడీ చేసిన తనిఖీల్లో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు గతంలో అనేక ఆర్థిక అవినీతి కేసుల్లో A2గా ఉన్న వేణుంభాకం విజయ్ సాయి రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నాడని ఈడీ తెలపటం దీనికి ఏమి సమాధానం చెప్తావు దొంగ లెక్కల సాయి రెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ప్రశ్నించారు ఎప్పుడూ నీతి వాక్యాలు చెబుతూ, అవినీతి ధ్యేయంగా అక్రమార్చనే లక్ష్యంగా బ్రతుకుతూ నెలల తరబడి జైల్లో చిప్పకూడు తిని ఎదుటి వ్యక్తిల మీద బురద చల్లుతూ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే విజయసాయిరెడ్డి ఈ రాష్ట్రంలో చేసే అవినీతి సరిపోవటం లేదంటూ పక్క రాష్ట్రాల్లో కూడా తన దొంగ లెక్కల తెలివితేటలతో అవినీతికి పాల్పడటం ఈ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ అని నిజంగా రాష్ట్రం పట్ల ఏమాత్రం గౌరవం, చిత్తశుద్ధి ఉన్న వెంటనే నీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకపక్క మన రాష్ట్రాన్ని తన అవినీతితో లూటీ చేస్తూ మరోపక్క పక్క రాష్ట్రాల్లో కూడా లూటీకి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని దీనిలో దొంగల ముఠా నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరపాలని, ఎందుకంటే సృజన్ రెడ్డి అక్రమాస్తులను జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టిన విషయం అందరికి తెలుసని, దానికి యజమాని ముఖ్యమంత్రి భార్య భారతి రెడ్డి కావడం ఇదంతా ముఖ్యమంత్రి కుటుంబానికి సంభందించిన అవినీతి అని అందుకే దీనిపై ఈడీ, సిబిఐ సమగ్ర విచారణ జరపాలని శేషు డిమాండ్ చేశారు…