ANDHRABREAKING NEWS

కె.జి.ఎఫ్ స్టార్ యష్ సూపర్ స్టార్ డమ్ కు

తిరుగులేని పునాది వేసిన చిత్రం ఇప్పుడు తెలుగులో

కె.జి.ఎఫ్ స్టార్ యష్
సూపర్ స్టార్ డమ్ కు తిరుగులేని పునాది వేసిన చిత్రం
ఇప్పుడు తెలుగులో

తెలుగు వార్త సినిమా:
హైదరాబాద్ ఫిలిం నగర్ న్యూస్.
తెలుగు నిర్మాతలమండలి ప్రధాన కార్యదర్శి
టి.ప్రసన్నకుమార్ విడుదల చేసిన
లక్కీ స్టార్’ ప్రచార చిత్రం!!రాధికా కుమారస్వామి సమర్పణలో
లక్కీ స్టార్’గావస్తున్న
పాన్ ఇండియా స్టార్ యష్
సెన్సార్ పూర్తి-త్వరలో విడుదల!!
కె.జి.ఎఫ్-1, కె.జి.ఎఫ్-చాప్టర్2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ నటించగా… కన్నడలో ఘన విజయం సాధించిన “లక్కీ” అనే చిత్రం తెలుగులో “లక్కీ స్టార్”గా రానుంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు “లక్కీ స్టార్” చిత్రాన్ని తీసుకువస్తున్నారురాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా “లక్కీ స్టార్” ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి… కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పాల్గొన్నారు. కేజీఎఫ్ స్టార్ యష్ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల గీత రచయిత గురు చరణ్, డైలాగ్ రైటర్ సూర్య సంతోషం వ్యక్తం చేశారు!!
చిత్రనిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ… “తెలుగులోనూ స్ట్రెయిట్ గా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఈ చిత్రానికి చాలా ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా… మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా చాలా బాగా ఆడి, మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, “రాబర్ట్’ ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు” అన్నారు!!
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: కేశవ్ గౌడ్, కూర్పు: దీపు ఎస్. కుమార్, ఛాయాగ్రహణం: కృష్ణ, సంగీతం: అర్జున్ జన్య (రాబర్ట్ ఫేమ్), బ్యానర్: శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్, సమర్పణ: రాధికా కుమారస్వామి, నిర్మాత: రవిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డాక్టర్ సూరి!!

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!