ANDHRABREAKING NEWSTELANGANA

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కొవ్వొత్తు లతో సంతాపం

తెలిపిన మంథని ఏరియా కాంగ్రెస్ పార్టీ నాయకులు

తెలుగు వార్త.మం థని డిసెంబర్ 28 మంథని డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కొవ్వొత్తు లతో సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు ఆర్థిక వేత్తగా,ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా,రాజ్యసభ సభ్యుడిగా,ప్రతిపక్ష నాయకుడిగా,ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ గారి మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్,మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ,సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, సీనియర్ కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు కుడుదుల వెంకన్న, బూడిద శంకర్,ఎరుకల ప్రవీణ్,కొండ శంకర్,పెరవేణ లింగయ్య,మంథని సత్యం,రావికంటి సతీష్,మంథని రాకేష్,కొత్త శ్రీనివాస్, మంథని సురేష్,లైసెట్టి రాజు,పర్శవేనా మోహన్,ఎరుకల రమేష్ బాబు,పొరండ్ల రంజిత్,బూడిద రమేష్,చంద్రు విజయ్,రామ్ రాజశేఖర్,ఆరేళ్లి కిరణ్,తాటి శ్రీధర్,కుడుదుల రాము,పార్వతి కిరణ్,మంథని శ్రీనివాస్,అక్కాపాక సాధి, జంజర్ల శైలేందర్,రాధారపు నితీష్,అర్ల జ్ఞాని,జాఫర్, ఏసాన్,రమేష్,శ్రీనివాస్,సురేష్,రాకేష్,శివకృష్ణ,సాయికిరణ్,నగేష్,సుదర్శన్,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!