
ఆత్మకూర్…SI హరిప్రసాద్, నాటుసారా పై దాడులు
సిద్దాపురం లో రెండు బైకులు సిజ్
60 లీటర్ల నాటుసారా. పట్టివేత.
2000.ల లీటర్ల .డేస్ట్ వాష్ ధ్వంసం
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని సిద్దాపురం గ్రామం నందు శనివారం నాడు నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు ఎస్సై హరిప్రసాద్ వారి సిబ్బందితో 60 లీటర్ల నాటుసారాను రెండు బైకులను సీజ్ చేసినట్లు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవ్యతిరేకమైన నాటుసారా, గుట్కాలను, పేకాట ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారాన్ని 100 కు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.