ANDHRABREAKING NEWS

దళితుల హక్కులను కాలరాస్తు హరించే ప్రయత్నాలు మానుకోవాలి.!!

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.!!!

దళితుల హక్కులను కాలరాస్తు హరించే ప్రయత్నాలు మానుకోవాలి.!!

రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.!!!

జిల్లా యస్సి సెల్ చైర్మన్ యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు

తెలుగు వార్త :
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలని జిల్లా యస్సి సెల్ చైర్మన్ యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు హితవు పలికారు.కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా జవాబుదారీ తనంతో చట్టబద్ధ పాలన చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దళితులను దగా చేస్తున్నాయని విమర్శించారు.గత ఏడేళ్ళలో అధికారంలో ఉన్న బీ.జే.పి మోడీ సర్కార్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తూ అణగారిన కులాల,శ్రామిక వర్గాల,పేద ప్రజలహక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.గురువారం నాడు పాత్రికేయుల సమావేశంలో మెడబలిమి వెంటేశ్వరరావు మాట్లాడుతూ మనువాదపు భావజాలంతో దళిత వర్గాలపై భౌతిక దాడులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి పథకాలను చాటున రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించే కుట్రలను చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఎస్సి ఎస్టి,రక్షణ సబ్ ప్లాన్ చట్టాలను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ రంగాలను కార్పోరేట్లకు కారు చవకగా అమ్మేస్తూ దళిత వర్గాల ఉద్యోగ,ఉపాధి రంగాల నుండి తరిమేస్తున్నారని ఆరోపించారు.డా.బి.ఆర్.అంబేడ్కర్ కృషి ఫలితంగా స్వాతంత్రమునకు పూర్వమే
ప్రారంభమైన ఎస్సి ఎస్టి విద్యార్థుల స్కాలర్ షిప్ లకు కోత విధించి విద్యారంగం నుండి ఆయా వర్ణాల విద్యార్థులను దూరం చేసే కుట్రలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలకు వదిలేసారన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి గ్రామీణ వలసలను పెంచారని,కరోనా కష్టకాలంలో కాలి నడకతో నగరాలను వదిలి వారందరు సొంత గ్రామాలకు తరలి వెళ్ళడాన్ని మనందరం కళ్ళారా చూడటం నగ్న సత్యం అని పేర్కొన్నారు.కార్మికులు,రైతుల హక్కులను హరించే నూతన చట్టాలతో వారిని కార్పోరేట్ బానిసలగా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కార్మికులు రైతులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని,నల్లధనాన్ని వెలికి తీయాలి,అవినీతిని అంతం చేయాలనే ఉత్తర కుమారుడి ప్రేలాపనలతో పెద్ద నోట్లను రద్దు చేసి కార్బోరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.అశాస్త్రీయ జీఎస్టీ విధానాలు చిన్న తరహా వ్యాపారాలను,చిల్లర వీధి వ్యాపారులను చిన్నాభిన్నం చేసిందని,కరోనా పేరుతో ముందస్తు చర్యలు తీసుకోకుండా దేశం అంతా లౌక్ డౌన్ ప్రకటించి దేశ ఆర్థిక
వ్యవస్థను అధ:పాతాళానికి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పేదలను మరింత నిరుపేదలుగా మార్చేసిందన్నారు.మహిళలుమైనార్టీలు,దళిత ఆదివాసీల పై పెరిగి పోతున్న అత్యాచారాలను అరికట్టడంలో చట్టాలుగాని,యంత్రాంగం గాని ఏ మాత్రం శ్రద్ధ వహించకపోగ ప్రత్యక్షంగా నిందుతులకు బహిరంగంగా మద్దతు తెలిపిన సందర్భాలు కోకొల్లలు,ఎస్సి ఎస్టి కేసులలో ముద్దాయిలకు ముందస్తు బెయిల్ మంజూరు
చేయడం,సాధారణ కేసులుగా కేసులను నమోదు చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని,ఆంధ్రప్రదేశ్ లో అణగారిన కులాల ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో తనకు దన్నుగా ఉన్న దళిత వర్గాల హక్కులను హరించడం విచిత్రంగా ఉందన్నారు.చారిత్రకంగా వేల సంవత్సరాలుగా తమకు జరిగిన సామాజిక అన్యాయాలపై దళిత ఆదివాసీలు పోరాడి సాధించుకున్న విద్య,ఉద్యోగ,ఉపాధి,రక్షణ హక్కులతో పాటు అన్ని రంగాలలో ఇతరులతో సరి సమానంగా అభివృద్ధి చెందడానికి రూపొందించబడిన ప్రత్యేక హక్కులు రక్షణ చట్టాలను సైతం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.పేదరికం ఆధారంగా రూపొందించిన నవరత్నాల సంక్షేమ పథకాలు అందరితో పాటు ఎస్సి ఎస్టి లకు కూడా వర్తింప చేసి చేతులు దులుపుకోవడం ఆయా వర్గాల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే అవుతుందని,గత సంవత్సరమున్నర కాలంగా వీరి కోసం ఏ ఒక్క ప్రత్యేక పథకాన్ని కూడా రూపొందించక పోగా ఇప్పటికే ఎప్పటి నుంచో అమలులో ఉన్న 28 సంక్షేమ పథకాలను రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి వీరి పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనం అని పేర్కొన్నారు.పాఠశాల విద్య నుండి విదేశీ ఉన్నత విద్య వరకు ఎస్సీ ఎస్టి లకు ప్రభుత్వ నుండి స్కాలర్ షిప్లు,వసతి సౌకర్యాలు స్వాతంత్ర్యం పూర్వము నుండే అమలులో ఉన్నాయని,అంబెడ్కర్ సాధించి రాజ్యాంగంలో భద్రపరిచిన హక్కును జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి,విద్యాదీవెన పేర్లతో కుటుంబానికి ఒక్కరికే అనే షరతు విధించడం దళిత విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని,బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్,స్టడీ సర్కిల్స్,అంబేడ్కర్ విదేశీ విద్య బుక్ బ్యాంక్,పి.జి,పరిశోధన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించే పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.ఎస్సి ఎస్టి లను విద్యకు దూరం చేసి డ్రాప్ అవుట్ రేటును పెంచే కుట్రలో భాగంగానే ఈ పథకాలను రద్దు చేసినట్లుగా భావించాల్సి వస్తుందని,సమాజములోని ఇతరులకు దళిత ఆదివాసీలకు మధ్య ఉన్న సామాజిక,ఆర్థిక అంతరాలను తగ్గించే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించబడ్డ ఎస్సి ఎస్టి సబ్ ప్లాన్ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసి ఆ నిధులను కొత్తగా ఏర్పాటు చేసిన 3 ఎస్సీ కుల సంక్షేమ కార్పోరేషన్ల ద్వారా నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.ఎంతో ఆర్భాటంతో బి.సి. సబ్ ప్లాన్ నిధులను కూడా 56 బి.సి. కుల కార్పోరేషన్ల ద్వారా నవరత్నపథకాలను అమలుచేస్తుందని,యువతి,యువకుల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడే కార్పోరేషన్లు యాక్షన్ ప్లాన్ చేయకుండా నిధులు కేటాయించకుండా గతంలో ఎంపికైన లబ్ధిదారులకు అందజేయాల్సిన పథకాలను అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో అధికారపార్టీ నాయకులు దళితులపై గతంలో కంటే కొత్త పద్ధతుల్లో దాడులు,అత్యాచారాలు,హింసాకాండలు,యధేచ్చగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వై.సి.పి ముఖ్య నాయకులుగా చలామణి అవుతూ,భూకబ్బాలు చేస్తూ,పోలీసులతో కుమ్మకై ఆత్మహత్యలకు పురిగొల్బడం, శిరోమండనాలు చేయించడం సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తూ వారి రక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.దళిత,ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని గాని,స్థానిక యంత్రాంగాన్ని కాని,బహిరంగంగా ప్రశ్చిస్తే సి.ఐ.డి. అధికారులు స్వయంగా ఆ నాయకులల్ని టార్గెట్ చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.దళితులపై రాజకీయపరమైన దాడులు, కక్ష్య సాధింపు చర్యలు కొనసాగిస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేయటం,అక్రమకేసులు బనాయించి జైలుపాలు చేయటం,మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని,దాడులకు గురవుతున్న వారిలో అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులు,అధికారులు,అడ్వకేట్లు,యువకులు,అసైన్డ్ రైతులు,రోజు వారీ రైతు కూలీలు,ఒంటరి మహిళలు,చిల్లర వర్తకులే అత్యధికులని పేర్కొన్నారు.జిల్లాల్లో ఎస్సీ,ఎస్టీల పై జరిగిన దాడులకు సంబంధించి అట్రాసిటీ చట్టానికి బదులుగా కేసులు నమోదు చేస్తున్నారని,కొన్నిచోట్ల వారిపైనే కౌంటర్ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లకు పిలిపించి కేసులను రాజీచేసుకోమని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!