
హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ గా ‘సుధీర్ 16’.. రెగ్యూలర్ షూటింగ్ షురూ
తెలుగు వార్త:
హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తుండగా.. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చిత్రంతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో సుధీర్ బాబు. రియల్ లైఫ్ ఆధారంగా రిలీజ్ అయిన ఈ చిత్రంతో సుధీర్ పర్లేదు అనిపించుకున్నాడు. ఈ ఏడాది వరుస చిత్రాలతో అలరించనున్నాడు. ఇందుకు రెగ్యూలర్ షూటింగ్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి ఆడిపాడనుంది. మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజా మరో యాక్షన్ ఫిల్మ్ రెగ్యూలర్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సుధీర్ 16’ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో